: విజయవాడలో విషాదం... పాల ప్యాకెట్ కోసం వెళుతున్న బాలుడిని బలిగొన్న చెట్టు!


విజయవాడ సత్యనారాయణపురంలో ఈ ఉదయం జరిగిన విషాద ఘటన ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఉదయాన్నే పాల ప్యాకెట్ తీసుకువచ్చేందుకు తన సైకిల్ పై వెళుతున్న 12 ఏళ్ల బాలుడు హర్షపై ఓ చెట్టు విరిగిపడగా, దాని కొమ్మలు గొంతులో గుచ్చుకుపోయి, ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన శిశువిద్యామందిర్ వద్ద జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించినా, అప్పటికే బాలుడి ప్రాణాలు పోయాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఘటనకు కారణమని, కూలేందుకు ఎన్నో చెట్లు సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నా, వారు పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు. ఆ ప్రాంతంలో కూలడానికి సిద్ధంగా ఉన్న చెట్లను స్థానికులే తొలగిస్తున్నారు.

  • Loading...

More Telugu News