: నిన్నటి టీమిండియా ఓటమి గురించి వాట్సప్ లో వైరల్ అవుతున్న జోక్... మీరూ చూడండి
నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. గ్రూప్ దశ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ నిన్నటి మ్యాచ్‌లో ఘోరంగా పరాజయం పాలవడంతో టీమిండియాపై అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్‌లో ఓ పోస్ట్ విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.
ఆ పోస్ట్‌లో విక్టరీ వెంకటేష్ నటించిన 'దృశ్యం' సినిమాలోని ఓ పోస్టర్ కనపడుతోంది. ఆ సినిమాలో వెంకటేష్ తన భార్యాపిల్లలకు సీరియస్‌గా చెప్పే డైలాగుకి పేరడీగా నెటిజన్లు ఓ డైలాగు రాసేసి తెగ షేర్లు చేసుకుంటున్నారు. ఈ పోస్టులో ఏముందంటే... ‘ఈ నెల 18న మనం అసలు టీవీ ఆన్ చేయలేదు. ఆ రోజు క్రికెట్ చూడలేదు... భారత్ అసలు ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఆడిందో కూడా తెలియదు.. దాస్ అన్న వీడియోలు చూసి మనం మధ్యాహ్నమే పడుకున్నాం... ఇదే నిజం.. ఎవరు అడిగినా ఇదే చెప్పండి’ అని వెంకటేష్ సీరియస్‌గా తన భార్యాపిల్లలతో చెబుతాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్ ఇలా అన్నింటిలోనూ టీమిండియాపై నెటిజన్లు సైటెర్లు వేస్తున్నారు.