: చంద్రబాబు విన్నపానికి మమతా బెనర్జీ సమాధానం ఇదే!


ఎన్డీయే తరపున రామ్ నాథ్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రామ్ నాథ్ ను ఎన్డీయే అభ్యర్థిగా ఎంపిక చేశామని బాబుకు చెప్పిన మోదీ... ఆయనకు మరో బాధ్యతను అప్పజెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి, రామ్ నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతు సంపాదించాలని కోరారు.

ఈ నేపథ్యంలో మమతకు చంద్రబాబు ఫోన్ చేసి, మద్దతు కోరారు. దీనికి సమాధానంగా, తాను నెదర్లాండ్స్ ట్రిప్ లో ఉన్నానని.. వచ్చిన వెంటనే ఈ విషయంపై మాట్లాడతానని చంద్రబాబుతో మమత అన్నారు. ఈ ఉదయమే మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె నెదర్లాండ్స్ వెళ్లారు. ఇటీవలే ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఎన్టీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో వెల్లడైన తర్వాతే మద్దతు ప్రకటించాలా? లేదా? అనే విషయం గురించి తాము ఆలోచిస్తామని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News