: మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు సంప్రదింపులు
ఎన్డీఏ తమ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవిద్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్‌నాథ్ కోవిద్‌కు మద్దతిస్తానని చెప్పిన చంద్రబాబు.. మోదీ సూచన మేరకు అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో ఆయన మాట్లాడారు. రామ్‌నాథ్ కోవిద్‌కు మద్దతు తెలపాలని మమతా బెనర్జీని చంద్రబాబు కోరారు.