: రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ప్రకటించిన కేసీఆర్
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ ను బరిలోకి దించుతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రామ్ నాథ్ కోవింద్ కు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించినట్టు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, దేశానికి ఉపయోగపడేలా భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థించిందని ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ కేటీఆర్ అన్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా అట్టడుగు వర్గానికి చెందిన మంచి విద్యావంతుడిని ఎంపిక చేయడం హర్షణీయమని అన్నారు.