: కుంబ్లేతో వేగడం ఇక నా వల్ల కాదు: బీసీసీఐ అడ్వైజరీ కమిటీతో చెప్పేసిన కోహ్లీ
హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో తాను విసిగిపోయానని... ఇక ఆయనతో వేగలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తేల్చి చెప్పినట్టు సమాచారం. శనివారం సాయంత్రం సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ముందు కోహ్లీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఈ ముగ్గురి ముందు కుంబ్లే తీరుపై కోహ్లీ మండిపడ్డాడట. ఈ విషయాన్ని బీసీసీఐలోని ఓ అధికారి తెలిపారు. కమిటీ ముందు కుంబ్లేకు సంబంధించి తన అభిప్రాయం ఏమిటో కోహ్లీ స్పష్టం చేశాడట. అయితే, ముగ్గురు దిగ్గజాలతో కూడిన అడ్వైజరీ కమిటీ కుంబ్లేను కూడా కలసిన తర్వాతనే ఓ నిర్ణయానికి వస్తుందని సదరు అధికారి తెలిపాడు. ఈ రోజు లండన్ లో కుంబ్లేను అడ్వైజరీ కమిటీ కలిసే అవకాశం ఉంది.