: బిహార్ లో బాలికపై గ్యాంగ్ రేప్... అనంతరం రైల్లో నుంచి తోసివేత


బిహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం నడుస్తున్న రైలు నుంచి ఆమెను తోసేశారు. ఇలా చేసింది కూడా ఆరుగురు బాలురే కావడం గమనార్హం. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లఖిసరాయ్ జిల్లాలోని లఖోచాక్ గ్రామంలో తన నివాసం నుంచి బాలికను నిందితులు అపహరించుకుపోయారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆరు నుంచి ఏడుగురు ఆమెపై అఘాయిత్యం చేసినట్టు బాధిత బాలిక బయట పెట్టింది. వీరిలో ఇద్దరు తన ఇంటి పొరుగున ఉండేవారేనని తెలిపింది.

అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె కొంత సమయం తర్వాత మేల్కొంది. చూస్తే నడుస్తున్న రైల్లో ఉన్నట్టు అర్థమైంది. తన ఇంటి పొరుగున ఉండే ఇద్దరు బాలురు తనను రైలు నుంచి కిందకు తోసేశారని వివరించింది. ఒళ్లంతా గాయాలతో కిలు రైల్వే స్టేషన్ సమీపంలో పడి ఉన్న బాలికను గుర్తించి పాట్నా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో పాటు, ఐదు చోట్ల పెల్విక్ బోన్ ఫ్రాక్చర్ అయినట్టు వైద్యులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట మొదలు పెట్టారు. నిందితులను పట్టుకుని బాలికకు న్యాయం చేస్తామని రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News