: రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆరోగ్యంగా దీర్ఘకాలం పాటు జీవించాలని ఆకాంక్షించారు. కానీ, దీనిపై రాహల్ గాంధీ ఇంకా స్పందించలేదు. ఆయన తన పుట్టిన రోజును అమ్మమ్మ (సోనియాగాంధీ తల్లి) సమక్షంలో జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లారు. అక్కడే కొన్ని రోజుల పాటు గడపాలని అనుకుంటున్నట్టు జూన్ 13న రాహుల్ చివరిగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.