: ఈశాన్య భారతం వణికింది... ఇంఫాల్ లో భూప్రకంపనలు
ఈశాన్య భారతదేశం వణికింది. మణిపూర్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోవడంతో ప్రజలు ఆందోళణకు గురయ్యారు. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం తీవ్రత కేవలం 4.4గా రిక్టర్ స్కేలుపై నమోదైందని, ఇది పెద్ద భూకంపం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. పలుమార్లు భూమి కంపించడంతో ఈ రాష్ట్రంలో ప్రజలు నిద్రలేకుండా బయటే గడిపినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.