: ఇంకో గంటలో చనిపోతానని తెలిసినా నేను భయపడను: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
ఇంకో గంటలో తాను చనిపోతానని తెలిసినా భయపడే రకాన్ని కాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘మిమ్మల్ని హతమారుస్తామంటూ గతంలో బెదిరింపులు వచ్చాయి కదా? భయపడ్డారా?’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అటువంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. గతంలో తనకు నాలుగు సార్లు గుండెపోటు వచ్చిందని, తనకు బైపాస్ సర్జరీ కూడా జరిగిందని, అప్పుడే భయపడలేదని చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు అలా కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.