: వివాదాస్పదమైన ఛార్మి డ్రెస్... సీరియస్ అయిన పూరీ!


ఇటీవల మోకాళ్ల పైభాగం కనిపించేలా.. ప్రధాని ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ప్రియాంకా చోప్రా విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇలాంటి వివాదంలోనే టాలీవుడ్ నటి చార్మి కూడా ఇరుక్కుంది. ఈ మధ్య ఛార్మి ఒక గురుద్వారాకి వెళ్లింది. సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాకి మోకాళ్ల పై భాగం కనిపించేటటువంటి లాంగ్ గౌన్ ధరించి వెళ్లింది. ఈ డ్రెస్సును చూస్తే షర్టు వేసుకుని ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. దీంతో పెను దుమారమే రేగింది. ప్రియాంకాకి ఎటూ బుద్ధి లేదు.. నీ బుద్ధి ఏమైందంటూ నెటిజన్లు ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు. 'నీ ఫ్యాషన్ చూపించడానికి గురుద్వారాయే దొరికిందా?' అంటూ చీవాట్లు పెడుతున్నారు. దీంతో ఛార్మీపై ఆమె సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు పూరీ మండిపడ్డాడట. అనవసరంగా ఎందుకీ రచ్చ? అని అంతెత్తున ఆమెపై ఎగిరిపడ్డాడట!

  • Loading...

More Telugu News