: కోచ్‌తో ఘర్షణ.. గౌతమ్ గంభీర్‌పై వేటు.. నాలుగు మ్యాచ్‌ల నిషేధం!
టీమిండియా వెటరన్ గౌతమ్ గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడింది. ఈ ఏడాది మొదట్లో ఢిల్లీ రంజీ కోచ్ కేపీ భాస్కర్‌పై అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడంతోపాటు ఘర్షణ పడినందుకు గాను గంభీర్‌పై వేటు వేశారు. దీంతో గంభీర్ నాలుగు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) నియమించిన కమిటీ గంభీర్‌ను దోషిగా తేల్చింది. సహించలేనంతంగా అతడు ప్రవర్తించాడని గుర్తించింది. మార్చి 30, 2019 వరకు గంభీర్‌పై నిషేధం అమల్లో ఉంటుంది. ఈ కాలంలో నాలుగు మ్యాచ్‌లు అతడు ఆడడానికి వీల్లేదు. డీడీసీఏ జట్టు ఒడిశాలో ఉన్నప్పుడు జట్టు కోచ్ భాస్కర్ పిళ్లైతో గంభీర్ గొడవ పడడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించాడు. పిళ్లై ఫిర్యాదు మేరకు డీజీసీఏ ఓ కమిటీని నియమించింది. విచారణ అనంతరం కమిటీ చేసిన సూచన మేరకు గంభీర్‌పై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించారు.