: వరుణ్ తేజ్, సాయిపల్లవి ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి: హరీశ్ శంకర్, లావణ్య త్రిపాఠి
టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్, దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఫిదా’ సినిమా ట్రైలర్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ప్రేమలో ఎలా పడ్డారన్న కథాంశంతో రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ అందరినీ అలరిస్తోంది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్ సరసన సాయిపల్లవి నటిస్తోంది. ఈ టీజర్‌కు టాలీవుడ్ ప్రముఖులు ఫిదా అయిపోయారు. ఈ టీజర్‌ను చూసిన దర్శకుడు హరీశ్ శంకర్... వరుణ్‌తేజ్, సాయిపల్లవిల ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నాడు. వరుణ్‌తేజ్ లుక్ చాలా బాగుందని అన్నాడు. ఫిదా టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ టీజర్‌పై స్పందిస్తూ 'సూపర్ క్యూట్ వన్' అని ట్వీట్ చేసింది.