: విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ముందు వైసీపీ ధర్నా... జేసీ దివాకర్ రెడ్డి తీరుకి నిరసన
విశాఖపట్నం విమానాశ్రయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల ఇండిగో విమానయాన సిబ్బందితో గొడవ పెట్టుకోవడం పట్ల ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇండిగో సిబ్బందితో జేసీ ప్రవర్తించిన తీరు పట్ల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విశాఖపట్నం విమానాశ్రయం ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ఒక ఎంపీ ఇటువంటి ఘటనకు పాల్పడడం రాష్ట్రానికే సిగ్గుచేటని వైసీపీ విమర్శించింది. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు.