: అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్: ఇండోనేషియా ఓపెన్‌ సెమీఫైనల్ లో ప్రపంచ నెం.1 సాన్ వాన్ హొపై విజయం


 ఇండోనేషియా ఓపెన్‌లో భార‌త స్టార్ షెట్ల‌ర్ కిదాంబి శ్రీకాంత్ అద‌ర‌గొట్టేశాడు. ఈ రోజు జ‌రిగిన మెన్స్ సింగిల్స్‌ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్ సాన్ వాన్ హొ(కొరియా)ను ఆయ‌న ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. 21-15, 14-21, 24-22 తేడాతో విజ‌య దుందుభి మోగించాడు. దీంతో ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టాడు. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, చైనీస్ షెట్ల‌ర్‌ను ఓడించిన కిదాంబి శ్రీ‌కాంత్ ఈ రోజు కూడా అంతే ధాటిగా ఆడి గెలుపొందాడు.          

  • Loading...

More Telugu News