: బాప్ రే! ఈ వీడియో చూస్తే గుండె దడ మొదలవ్వాల్సిందే... గాల్లో కార్ల విన్యాసం అద్భుతం!
సీ సా తెలుసు కదా. మధ్యలో సపోర్ట్ ఉండి పొడవాటి బల్లపై అటొకరు ఇటొకరు కూర్చుని పైకి కిందకు ఊగుతూ ఉంటారు. ఎగ్జిబిషన్లలో ఇలాంటివి దర్శనమిస్తుంటాయి. కానీ, ఇటువంటి వేదికపై గాల్లో 10 మీటర్ల ఎత్తులో సీసాపై రెండు కార్లు ఎదురెదురుగా ఉండి ఒకదానినొకటి ఢీకొట్టుకుంటూ ఉంటే... చూసేవారి గుండె గట్టిగా కొట్టుకోవాల్సిందే! చైనాకు చెందిన పీపుల్స్ డైలీ ఈ నెల 16న ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ అద్భుత విన్యాసాన్ని ఒక్కసారైనా చూసి తీరాల్సిందే.