: కూత పెట్టిన కొచ్చి మెట్రో... ప్రారంభించి రైలెక్కిన ప్రధాని!
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలోని కొచ్చి నగరంలో మెట్రో రైలు తొలి దశను ఈ రోజు ప్రారంభించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేరళ సీఎం పినరాయి విజయన్, ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఈ శ్రీధరన్ కూడా ఉన్నారు. పలరివత్తమ్ స్టేషన్ వద్ద రిబ్బను కత్తిరించి ప్రధాని పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత మెట్రో రైలు ఎక్కి అక్కడి నుంచి పథడిప్పాలెం వరకు ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కొచ్చిలో మొత్తం 25 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం తలపెట్టగా, మొదటి దశ కింద 13.2 కిలోమీటర్ల మేర రవాణాకు సిద్ధమైంది.