: లష్కర్ ఉగ్రవాదులు హతం.. అట్టుడుకుతున్న కశ్మీర్


లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందిన జునైద్ మట్టూతో పాటు అతని అనుచరుడిని నిన్న భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఈ నేపథ్యంలో, కాశ్మీర్ మరోసారి అట్టుడుకుతోంది. దీంతో, కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలను విధించారు. శ్రీనగర్ లోని కన్యార్, ఎంఆర్ గంజ్, రైనావరి తదితర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఫరూక్ అహ్మద్ లోన్ తెలిపారు. అంతేకాదు, కశ్మీర్ యూనివర్శిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. బారాముల్లా-బన్నిహల్ నగరాల మధ్య రైలు రాకపోకలను నిలిపివేశారు. షాపులు, స్కూళ్లు బంద్ అయ్యాయి. ప్రజా రవాణా మొత్తం ఆగిపోయింది. 

  • Loading...

More Telugu News