: మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. భయపడే ప్రసక్తే లేదు: మాజీ సీఎం కుమారస్వామి గౌడ
తప్పుడు కేసులు బనాయిస్తూ, తన నోరు నొక్కే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమరస్వామి గౌడ అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా, తాను భయపడే ప్రసక్తే లేదని... తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వివిధ శాఖలపై జరిగిన చర్చల సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధానంగా జంతకల్ మైనింగ్ విషయంలో ప్రస్తుతం ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు, కుమారస్వామి కుటుంబానికి రూ. 20 వేల కోట్ల బినామీ ఆస్తులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్యూరప్ప ఇటీవల విమర్శలు కురిపించారు. దీనికి కుమారస్వామి కౌంటర్ ఇస్తూ, తనకు ఎవరైనా రూ. 300-400 కోట్లు ఇస్తే తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ రాసి ఇచ్చేస్తానని సవాల్ విసిరారు.