: నిట్టనిలువుగా కూలిన మూడంతస్తుల భవనం.. 11 మంది సజీవ సమాధి


హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 11 మంది సజీవ సమాధి అయ్యారు. నిర్మాణ పనులు జరుగుతుండగా భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో చిక్కుకున్న 12 మందిలో 11 మంది మృతి చెందారు. బిల్డింగ్ నిర్మాణం కోసం మరో భవనం పక్కనే పునాదులు తవ్వుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారన్న విషయం తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే 11 మంది మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయి.

  • Loading...

More Telugu News