: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీసులు
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద ప్రభావం భారత్‌పై బలంగా పడుతోంది. సరిహద్దు ప్రాంతాల్లోని ఉగ్రవాదుల, పాక్ రేంజర్ల స్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేస్తూ దీటుగా జవాబు ఇస్తున్నప్పటికీ దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు ఆగడం లేదు. జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. తాజివారా అచాబల్ వద్ద ఉన్న పోలీసు బృందంపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయినట్లు తెలుస్తోంది. వెంటనే భద్రతాబలగాలు అక్కడకు చేరుకుని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టారు.