: ఏవీ సుబ్బారెడ్డితో నాకు ఎటువంటి విభేదాలు లేవు: మంత్రి అఖిలప్రియ
భూమా నాగిరెడ్డి ఆప్తమిత్రుడు, ఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఏపీ మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేశారనే వార్తల నేపథ్యంలో ఆమె స్పందించారు. బహిరంగంగా ఆరోపణలు చేస్తే తాను స్పందిస్తానని, వదంతులను నమ్మవద్దని అన్నారు. కాగా, నంద్యాలలో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా తనను పూర్తిగా పక్కన పెట్టేశారంటూ ఏవీ సుబ్బారెడ్డి వాపోవడం విదితమే. టీడీపీ కౌన్సిలర్లు తన వైపు ఉంటారా? లేక అఖిల ఫ్రియ వైపు ఉంటారో? తేల్చుకోవాలని నంద్యాలలో ఈరోజు జరిగిన అత్యవసర సమావేశంలో ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.