: నేను రాష్ట్రపతి అభ్యర్థిని కాదు..అవన్నీ వదంతులే: ‘మెట్రో’ మ్యాన్ శ్రీధరన్
రాష్ట్రపతి బరిలో తాను ఉన్నానంటు వస్తున్న వార్తలు అబద్ధమని ‘మెట్రో’ మ్యాన్ గా ప్రజాదరణ పొందిన ఈ. శ్రీధరన్ స్పష్టం చేశారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై తనతో ఎలాంటి చర్చలు జరగలేదని, ఈ విషయమై వస్తున్న వదంతులను నమ్మవద్దని చెప్పారు.