: ఎంపీ జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో దురుసుగా ప్రవర్తించిన ఎంపీ జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరదారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధ్యత గల ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా ప్రవర్తించడం సబబు కాదని అన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానయాన శాఖ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, సిబ్బందిపై భవిష్యత్ లో ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని ఆయన కోరారు.