: తెలుగు రాష్ట్రాల్లో ‘జనసేన’కు భారీ స్పందన : పవన్ కల్యాణ్
తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ అంశంపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోని ఏడు జిల్లాలతో పాటు, తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో జనసేన పార్టీ ఎంపికలకు భారీ స్పందన వచ్చిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా జిల్లాల్లోనూ పార్టీ ఎంపికలు వేగంగా జరుగుతున్నాయని, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించినట్టు పవన్ చెప్పారు.