: ముంబై రెడ్ లైట్ ఏరియాల్లో బాలికలు తగ్గారట!


బాలికలను అక్రమంగా వ్యభిచార కూపాలకు తరలించడం కాస్త నెమ్మదించింది. ముంబై రెడ్ లైట్ ఏరియాల్లో ఇప్పుడు బాలికల సంఖ్య 5.5 శాతానికి తగ్గిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గతంలో వీరి సంఖ్య 40 శాతంగా ఉండేది. 2015 నుంచి 2016 మధ్య ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజేఎం) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 20,000 మంది సెక్స్ వర్కర్లు, 1,000 మంది వ్యభిచారిణులు, మరో 200 మంది సెక్స్ వర్కర్లు ప్రైవేటు ప్రదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తునట్టు వెలుగులోకి వచ్చింది. ఆరేడేళ్ల క్రితం అందరూ అమ్మాయి కావాలని అడిగే వారని, ఇప్పుడు అది అసాధ్యంగా మారిందని ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రాంతీయ డైరెక్టర్ సంజయ్ మక్వాన్ తెలిపారు.

అమ్మాయి కావాలని అడిగితే ముందు లేదనే చెబుతారని, వచ్చిన కస్టమర్ పోలీసులకు సమాచారం ఇచ్చే వ్యక్తి కాదని నమ్మకం కుదిరే వరకు అంతేనని పేర్కొన్నారు. మొత్తానికి గతంతో పోలిస్తే వ్యభిచార కేంద్రాల్లో బాలికల సంఖ్య చాలా వరకు తగ్గిందన్నారు. ఈ ఘనత అంతా పోలీసులదేనన్నారు. వీరు తమ అధ్యయనంలో భాగంగా 25 మంది బాలికలను ప్రైవేటు ప్రదేశాల్లో (వ్యభిచార కేంద్రాలు కాకుండా) గుర్తించారు. రహస్య ప్రదేశాల్లో బాలికలను గుర్తించడం అన్నది తమకు పెద్ద సవాల్ గా మారిందని సంజయ్ మక్వాన్ అన్నారు. కాగా, ఇళ్లు, లాడ్జిల్లోకి వ్యభిచార నిర్వహణ మారిందన్నది స్థానికుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News