: షారూఖ్ ఖాన్ ని అరెస్టు చేయాల్సిందే: కోర్టుకిచ్చిన నివేదికలో డీఎస్పీ


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ ని అరెస్టు చేయాలంటూ రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ వడోదర న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. షారూఖ్ ఖాన్ తన ‘రయీస్‌’ సినిమా ప్రమోషన్ లో భాగంగా గత జనవరి 23న వడోదరకు క్రాంతి ఎక్స్‌ ప్రెస్‌ లో సహచర నటీనటులతో కలిసి వచ్చాడు. ఈ సమయంలో రైల్వే స్టేషన్ లో భారీ ఎత్తున షారుక్‌ ను చూసేందుకు అభిమానులు వచ్చారు. దీంతో వడోదర రైల్వేస్టేషన్ జనాలతో కిక్కిరిసిపోయింది. అభిమానులను చూసిన షారూఖ్ వారిని ఉత్సాహపరుస్తూ సినిమాకు సంబంధించిన టీషర్టులు, బాల్స్‌ విసిరాడు.

వీటిని పట్టుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఒక వ్యక్తి దుర్మరణంపాలు కాగా, మరో ఇద్దరు పోలీసులు స్పృహ కోల్పోయారు. దీనిపై న్యాయస్థానం నివేదిక కోరడంతో ఈ కేసును రైల్వే డీఎస్పీ తరుణ్ బరోత్ దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగా సేకరించిన వివరాలతో ఒక నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. షారూఖ్ అలా టీషర్టులు విసరకపోయి ఉంటే ఆ వ్యక్తి బతికి ఉండేవాడని.....ఈ దారుణానికి షారూకే కారణం కనుక అతనిని అరెస్టు చేయాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News