: వేలంపాటలో భారీ ధరకు అమ్ముడుపోయిన జగ్గారెడ్డి బ్రేస్ లెట్!
తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బ్రేస్ లెట్ వేలంపాటలో ఏకంగా రూ. 20 లక్షలకు అమ్ముడుబోయింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ బ్రాస్ లెట్ ను వేలం వేశారు. జీరెడ్డి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఈ బ్రేస్ లెట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, వేలంపాటలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కృషి డెవలపర్స్ అండ్ బిల్డర్స్ యజమాని మహేందర్ రెడ్డి బ్రేస్ లెట్ ను సొంతం చేసుకున్నారని చెప్పారు.
ఈ బ్రేస్ లెట్ ధర రూ. 4 లక్షల వరకు ఉండవచ్చని... అయినా, మరో రూ. 16 లక్షల అధిక మొత్తానికి వారు ఈ బ్రేస్ లెట్ ను సొంతం చేసుకోవడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఖమ్మం రైతుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నామని... రైతుల కోసం కృషి డెవలపర్స్ వారు ఇంత మొత్తాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ సూచన మేరకు వీహెచ్ ఈ బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డికి బహూకరించారు.