: ఎన్ డీఏ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో తెరపైకి కొత్తముఖం


కేంద్రంలోని బీజేపీ సారధ్యంలో గల ఎన్ డీఏ సర్కారు రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎవరిని ఎంపిక చేస్తుందన్నది అత్యంత ఉత్కంఠగా మారింది. ఎవరిని ఆ అదృష్టం వరిస్తోందో గానీ, రకరకాల పేర్లు మాత్రం ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఇ.శ్రీధరన్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకవేళ రాజకీయేతర వ్యక్తినే ఎంచుకోవాల్సి వస్తే శ్రీధరన్ పేరును బీజేపీ పరిశీలించొచ్చన్నది సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ముందుగా వెల్లడించేది లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు.

బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ తోనూ ఈ రోజే భీటీ కానున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతోనూ సమావేశమై ప్రతిపక్షం అభిప్రాయం ఏంటన్నది తెలుసుకోనున్నారు. ప్రతిపక్షానికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంచుకోవాలని, అందరి ఆమోదంతో రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది.

  • Loading...

More Telugu News