: వైరల్ అవుతున్న హర్భజన్ సింగ్ వీడియో.. మీరూ చూడండి!


టీమిండియా స్ట్రాంగ్ మెన్ యువరాజ్ సింగ్ తో స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏళ్ల పాటు ఇద్దరూ కలసి డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నారు. 20 ఏళ్లకు పైగా వీరు మంచి మిత్రులుగా ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ యువరాజ్ కు 300వ వన్డే కావడం విశేషం. ఈ సందర్భంగా యువరాజ్ గురించి భజ్జీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

"నా సోదరుడు, స్నేహితుడు యువీ 300వ వన్డే ఆడటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అరుదైన ఘనతను సాధించిన యువీకి శుభాకాంక్షలు. యువీపై, నాపై దేవుడు దయ చూపాడు. దేవుడి దయ వల్లే నేను 100 టెస్టులు ఆడగలిగా. యువీ, నీవు రికార్డు స్థాయిలో 300వ వన్డే ఆడుతున్నావు. ఇండియన్ క్రికెట్లో నీ ప్రయాణం నిజంగానే గొప్ప విషయం. నీవు మైదానంలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఛాంపియన్ వే. బంగ్లాతో జరిగే మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధిస్తావనే నమ్మకం నాకుంది. గాడ్ బ్లెస్ యూ బ్రదర్" అని చెబుతూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే, ఈ మ్యాచ్ లో యువీ అసలు బ్యాటింగ్ కే దిగలేదు. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News