: నేను ఏ తప్పూ మాట్లాడలేదు: 'తల నరికేస్తా' అన్న వ్యాఖ్యలపై బాబా రాందేవ్


ఎవరైతే భారత్ మాతాకీ జై అనడానికి నిరాకరిస్తారో వారి తల నరికేస్తానంటూ ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి.  ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలంటూ రోహ్ తక్ కోర్టు బాబాకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ కోర్టుకు బాబా రాందేవ్ హాజరుకాకపోవడంతో...  బుధవారం నాడు అతనికి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది కోర్టు.

ఈ సందర్భంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాబా మాట్లాడుతూ, తాను తప్పుగా ఏమీ అనలేదని చెప్పారు. తాను చట్టాన్ని నమ్ముతానని అన్నారు. తనకు ఏ కోర్టు నుంచి సమన్లు కానీ, వారెంట్లు కానీ రాలేదని చెప్పారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందని తెలిపారు. అయినా, ఇలాంటి విషయాలు మీకు ఎలా తెలుస్తాయో తనకు అర్థం కావడం లేదని మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు బాబా.

  • Loading...

More Telugu News