: జేసీ దివాకర్ రెడ్డిపై విమానయాన సంస్థల నిషేధం!
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించాయి. విశాఖపట్టణంలోని ఎయిర్ పోర్టులో బోర్డింగ్ పాస్ ఇవ్వలేదని ఆరోపిస్తూ దివాకర్ రెడ్డి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో బోర్డింగ్ పాస్ ప్రింటర్ ను ఎత్తిపడేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ జేసీపై నిషేధం విధించింది. ఈ మేరకు తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు జేసీని తమ విమానాల్లో ప్రయాణానికి అనుమతించబోమని ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది.
ఆ వెంటనే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ సంస్ధలు కూడా జేసీపై నిషేధం విధించాయి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గతంలో ఎయిరిండియా సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత ఎయిరిండియా ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది. మరి జేసీ సంగతి ఏమవుతుందో చూడాలి!