: భూ కుంభకోణంలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు
విశాఖపట్టణంలోని భూ కుంభకోణం వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్ ల తీరుతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. భూ కుంభకోణం వ్యవహారమై విచారణ నిమిత్తం సిట్ వేసిన తర్వాత కూడా ఈ అంశంపై మాట్లాడటం సరికాదని అన్నారు.