: సోషల్ మీడియాలోనూ దూసుకుపోతున్న ప్రియాంక చోప్రా


బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మ‌రోవైపు అమెరిక‌న్ టీవీ సీరియ‌ల్‌ ‘క్వాంటికో’లోనూ అద‌ర‌గొట్టిన ఈ అమ్మ‌డికి ఎంతో క్రేజ్ వ‌చ్చేసింది. సోష‌ల్ మీడియా సైట్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గూగుల్స్ ప్లస్ వంటి వాటిల్లో మోస్ట్ పాప్యులర్ ర్యాంకింగ్ లో ఆమె అగ్ర‌స్థానంలో నిలిచింది. సోషల్ మీడియా ఎనలిటిక్స్ కంపెనీ 'ఎంవీ పిండిక్స్' తాజాగా విడుద‌ల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో జాన్సన్ రెండో స్థానంలో ఉండ‌గా, యాక్టర్, కమెడియన్ కెవిన్ హర్ట్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక‌ వండర్ ఉమెన్ స్టార్ గాల్ గాఢట్, కారా డెలివింగ్నే, విన్ డీజిల్, జెన్నిఫర్ లోపేజ్, అస్లే బెన్సన్, జాక్ ఎఫ్రాన్ వ‌రుస‌గా ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.  

  • Loading...

More Telugu News