: ధోనీ కూతురు జివా పియానో ప్లే చేసేస్తోంది.. మీరూ చూడండి!


టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ బుల్లి కూతురు జివా పియ‌నో ప్లే చేసింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ధోనీ భార్య సాక్షి సింగ్... త‌న చిట్టికూతురు ఈ ప‌ని చేస్తుండ‌గా తీసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. జివా త‌న చిన్ని చిన్ని చేతుల‌తో పియానో వాయించ‌డం చూస్తోన్న ధోనీ అభిమానులు తండ్రికి త‌గ్గ కూతుర‌ని కితాబిస్తున్నారు. పియానో ప్లే చేయ‌డంలో ఎంతో అనుభ‌వం ఉన్న అమ్మాయిలా ఈ వీడియోలో జివా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ధోనీ చాంపియ‌న్స్ ట్రోఫీ సైమీ ఫైన‌ల్ పోరులో ఆడుతున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News