: చైనాలో దారుణం: నర్సరీ స్కూల్ లో భారీ పేలుడు.. ఏడుగురు చిన్నారుల మృతి
చైనాలోని ఓ నర్సరీ స్కూల్ లో విషాదం చోటుచేసుకుంది. జియాంగ్స్ ప్రావిన్స్ లోని ఫెంగ్జియాన్ కౌంటీలోని ఓ కిండర్ గార్డెన్ లో ఈ రోజు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. పాఠశాల ముగించుకుని పిల్లలు బయటకు వస్తుండగా, పాఠశాల గేట్ సమీపంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సంఘటనతో చిన్నారులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటనలో పలువురు చిన్నారులు మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్టు సంబంధింత అధికారుల సమాచారం. పాఠశాల ముగిసే సమయం కావడంతో తమ పిల్లలను తీసుకువెళ్లేందుకు తల్లిదండ్రులు అక్కడికి వచ్చిన సందర్భంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు ఎవరు బాధ్యులనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.