: బీడీ, గ్రానైట్, మిషన్ భగీరథకు జీఎస్టీ నుంచి మినహాయింపు నివ్వాలి: సీఎం కేసీఆర్ డిమాండ్
జీఎస్టీ నుంచి బీడీ, గ్రానైట్, మిషన్ భగీరథకు మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఆయన లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టుకుని బతుకుతున్నారని, బీడీ పరిశ్రమపై అధిక పన్ను కారణంగా ఉపాధికి నష్టం వాటిల్లుతుందని, గ్రానైట్, మార్చుల్స్, రా బ్లాక్స్ పై 12 శాతం, పూర్తి చేసిన ఉత్పత్తులపై 28 శాతం పన్ను వేశారని, దీంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.