: మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనే సమయంలో ఎమ్మెల్యేలకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయాలు అప్పట్లో వేడెక్కాయి. ఈ క్రమంలో శశి వర్గానికి చెందిన పళనిస్వామి సీఎంగా బలపరీక్షలో నెగ్గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు పళనిస్వామి డబ్బులు పంచారని ఆరోపిస్తూ స్టాలిన్ హైకోర్టు మెట్లెక్కారు.