: భారత్-బంగ్లా సెమీ ఫైనల్ మ్యాచ్: ఆదిలోనే బంగ్లాకు ఎదురుదెబ్బ
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే బంగ్లా ఓపెనర్ సౌమ్య డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఆయన క్లీన్ బౌల్డ్‌గా వెనుదిగాడు. అనంతరం క్రీజులోకి షబ్బిర్ వచ్చాడు. మరో ఓపెనర్ టమిమ్ ప్రస్తుతం ఆరు పరుగులతో, షబ్బిర్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ ఓవర్ ముగిసేనాటికి బంగ్లాదేశ్ స్కోరు.. ఒక వికెట్ నష్టానికి 11గా ఉంది.