: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్ల వివరాలు ఇవే!


ఛాంపియన్స్ ట్రోఫీ సెకండ్ సెమీఫైనల్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫే మోర్తజా టాస్ ఎగురవేయగా... కోహ్లీ హెడ్స్ చెప్పాడు. టాస్ హెడ్స్ పడింది. ఈ క్రమంలో కోహ్లీ ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపాడు.

టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఇంతకు ముందు ఆడిన జట్టుతోనే సెమీస్ బరిలోకి ఇండియా దిగింది. జట్టు సభ్యులు వీరే... రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ, యువరాజ్, ధోనీ, జాదవ్, హార్ధిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా.

బంగ్లాదేశ్ జట్టు సభ్యులు... తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, సాబీర్ రహ్మాన్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, మహ్ముదుల్లా, మొసాద్దెక్ హొస్సేన్, మోర్తజా, రూబెల్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, ముష్తాఫిజుర్ రహ్మాన్.

  • Loading...

More Telugu News