: లోయలో పడిపోయిన బస్సు... 10 మంది మృతి.. 30 మందికి గాయాలు
ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ధలియారా ప్రాంతం వద్ద చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి గాయాలయ్యాయి. వారంతా పంజాబ్‌కి చెందిన ప్రయాణికులుగా తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని గాయాలపాలయిన వారిని స్థానికుల సాయంతో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.