: జాతీయ గీతాన్ని అవమానించిన ఎస్ఎఫ్ఐ


సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎఫ్ఎఫ్ఐ జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని అవమానించింది. కేరళలోని కన్నూర్ జిల్లా థలస్సెరిలో బ్రెన్నెన్ ప్రభుత్వ కళాశాల 125 వసంతోత్సవాల సందర్భంగా విద్యార్థి  సంఘం ఓ మేగజైన్ ను తీసుకొచ్చింది. ఇందులో జాతీయ గీతాన్ని ఆలాపిస్తున్న సమయంలోనే ఓ జంట సన్నిహితంగా ఉండేలా చిత్రాలు గీశారు. ఈ పనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ డిమాండ్ చేసింది. తప్పుడు కోణంలో నుంచి చూస్తే తప్పుగానే అనిపిస్తుందని, మేగేజైన్ లో ఎటువంటి అసభ్యత లేదని కళాశాల ప్రిన్సిపాల్ మురళిదాస్ స్పష్టం చేశారు. ‘‘జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని అవమానించాలన్న ఉద్దేశం మాకు లేదు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని ప్లే చేసినప్పుడు లేచి నిలబడాలంటూ సంఘ్ పరివార్ ఒత్తిడి చేస్తున్న అతివాదాన్ని ప్రశ్నించేందుకే ఇలా చేశాం’’ అని ఎస్ఎఫ్ఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News