: అంతా క్లియర్ గా ఉందనే కొన్నా.. అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: డీఎస్
తాను ఎలాంటి అసైన్డ్ భూములను కొనలేదని... తనపై కొందరు లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. భూమి రికార్డులను పలుమార్లు తనిఖీ చేసిన తర్వాతనే తాను ఆ భూములను కొన్నానని... తాను కొన్న భూమి అంతకు ముందే పలుమార్లు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పారు. చాలా మంది చేతులు మారిన తర్వాతనే తాను ఆ భూమిని కొన్నానని ఆయన స్పష్టం చేశారు. 60 ఏళ్ల డాక్యుమెంట్లను పరిశీలించామని... అందులో ఎక్కడా అసైన్డ్ ల్యాండ్ అనే విషయం లేదని చెప్పారు. అంతా క్లియర్ గా ఉందనే ఆ భూమిని కొనుక్కున్నానని అన్నారు. వివాదాలు ఉన్న భూమి జోలికి తాను ఎందుకు వెళతానని ప్రశ్నించారు.