: అది పుకారు... నమ్మొద్దు!: నాగార్జున ట్వీట్
ప్రముఖ నటుడు నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అఖిల్ రెండో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అఖిల్ సరసన పలువురు బాలీవుడ్ నటీమణులను సంప్రదిస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. అఖిల్ సరసన శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ నటించనుందని తాజాగా వార్తలు వచ్చాయి.
దీనిపై నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆ వార్తలు వాస్తవం కాదని ప్రకటించారు. కాగా, అఖిల్ మొదటి సినిమా బాక్సాఫీసు వద్ద భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో సినిమాను కచ్చితంగా హిట్ చేసి, అఖిల్ సినీ జీవితానికి రాచబాట ఏర్పాటు చేయాలని నాగార్జున భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైవిధ్యమైన కథలు చేసే విక్రమ్ కుమార్ కు అఖిల్ తాజా చిత్రం బాధ్యతను అప్పగించారు.