: మరోమారు కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. నలుగురి మృతి.. ఆత్మహత్య చేసుకున్నదుండగుడు


అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యునైటెడ్ పార్సిల్ సర్వీస్ కంపెనీ (యూపీఎస్)లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వారిని కాల్చి చంపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  కాల్పులు జరిపిన వ్యక్తి యూపీఎస్ ఉద్యోగా ? కాదా? అన్న విషయం తేలలేదు. ఈ ఘటనలో ఉగ్రవాదానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలం నుంచి రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి సహా బాధితులందరూ డ్రైవర్లేనని యూపీఎస్ హెడ్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టీవ్ గాట్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News