: బాబా రాందేవ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ


ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ కు హర్యానాలోని రోహ్ తక్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2016 ఏప్రిల్ 3న రోహ్ తక్ లో ఆర్ఎస్ఎస్ సద్భావన సమ్మేళన్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న బాబారాందేవ్ సభికులనుద్దేశించి మాట్లాడుతూ, దేశ చట్టాలను గౌరవించి సహిస్తున్నామని, లేని పక్షంలో భారత మాతను అగౌరవ పరిచే లక్షలాది మంది తలలు తెగనరుకుతామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలపై హర్యానా మాజీ హోంశాఖ వ్యవహారాల మంత్రి సుభాష్ బాత్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆయన నేరుగా రోహ్ తక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో రెండు సార్లు విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసినా, ఆయన స్పందించలేదు. కోర్టుకు హాజరుకాలేదు. దీంతో రోహ్ తక్‌ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీష్ గోయల్,  బాబా రాందేవ్‌ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 3న జరగనుంది.

  • Loading...

More Telugu News