: ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న పాకిస్థాన్... వికెట్ నష్టపోకుండా 100 దాటిన స్కోరు
ఏ అంచనాలూ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌లోనూ అదరగొడుతూ ఇంగ్లండ్ టీమ్‌కి ముచ్చెమటలు పట్టిస్తోంది. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 49.5 ఓవర్లకి 211 పరుగుల వద్ద ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 212 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు అజర్, జమాన్ క్రీజులో పాతుకుపోయి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపిస్తున్నారు. చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డుని పరుగులు పెట్టిస్తున్నారు. జమాన్ .. 49 బంతులకి హాఫ్ సెంచరీ చేయగా మరో ఓపెనర్ అజార్ 56 బంతులు ఆడి 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్ స్కోరు 18 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 105 పరుగులుగా ఉంది.