: వాషింగ్‌మెషిన్‌లో మజ్జిగ తయారు చేసి.. దాహం తీర్చుతున్నారు!
ఎండల నుంచి ఉపశమనం పొందడానికి కూల్ డ్రింకులు, జ్యూస్‌లు, మజ్జిగ, చల్లనినీరు వంటి ద్రవాలను అధికంగా తీసుకుంటాం. దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు నీరు, ఒక్కోసారి మజ్జిగ అందిస్తుంటాయి. భారీ మొత్తంలో మజ్జిగను తయారు చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అయితే, జమ్ముకశ్మీర్ వాసుల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను అందించాలని భావించిన స్థానిక గోల్‌మార్కెట్ కమ్యూనిటీకి చెందిన సభ్యులు వినూత్న రీతిలో ఆలోచించారు. బట్టలు ఉతికే వాషింగ్‌మెషిన్‌లో మజ్జిగను తయారు చేస్తున్నారు. ఓ కొత్త వాషింగ్‌మెషిన్‌ను కొని పెరుగు, ఉప్పు, కొత్తిమీరలను అందులో వేసి స్విచ్ ఆన్ చేస్తున్నారు. దీంతో ఈజీగా మజ్జిగ తయారయిపోతోంది. ఎండాకాలం అయిపోయాక ఆ వాషింగ్‌మెషిన్‌ని ఎవరికైనా దానం చేస్తామని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.