: రాణిస్తున్న పాక్ బౌలర్లు... ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీ ఫైన‌ల్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ చేస్తోన్న పాకిస్థాన్ బౌల‌ర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పాక్ బౌల‌ర్ల ధాటికి ఇంగ్లండ్ కీల‌క బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఓపెన‌ర్ బెయిర్ స్టో 43, హేల్స్ 13, రూట్ 46 ప‌రుగ‌లకు అవుట‌యిన విష‌యం తెలిసిందే. అనంత‌రం మోర్గాన్ 33 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోరు వ‌ద్ద అవుట్ కాగా కాసేప‌టికే బ‌ట్ల‌ర్ కూడా 4 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఐదు వికెట్ల న‌ష్టానికి 35 ఓవ‌ర్ల‌లో 149 ప‌రుగులు చేసింది. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో హస‌న్‌కి రెండు వికెట్లు ద‌క్కగా, ర‌యీస్, జునైడ్‌, షాదాబ్‌ల‌కు చెరో వికెట్ ద‌క్కాయి. ప్ర‌స్తుతం క్రీజులో స్టోక్స్ 8, అలీ 1 ప‌రుగుల‌తో  ఉన్నారు. 

  • Loading...

More Telugu News