: భారత్ పై విజయమే లక్ష్యం... మైదానంలో కసరత్తులు చేస్తోన్న బంగ్లాదేశ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్‌లోకి ప్రవేశించడమే లక్ష్యంగా రేపు టీమిండియాతో బంగ్లాదేశ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా టీమ్ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అన్ని విభాగాల్లో తమ జట్టు రాణించడమే లక్ష్యంగా బంగ్లా క్రికెటర్లు మైదానంలో చమటోడుస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి ఫైనల్ చేరుకోవడమే తమ లక్ష్యమని బంగ్లా కెప్టెన్ మొర్తజా అన్నాడు. ఒత్తిడికి గురి కాకుండా వీలైనంత ప్రశాంతంగా మ్యాచ్ ఆడతామని చెప్పాడు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే ఆ జట్టు అద్భుతరీతిలో విజయాలను సాధిస్తూ ముందుకు వెళుతోంది. దీంతో రేపటి పోరులో టఫ్ ఫైటే ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.